లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ప్రవేశపెట్టిన ‘బీమా సఖి యోజన‘ (Bima Sakhi Yojana) మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన 3 ఏళ్ల స్టైపెండరీ పథకం. దీని ముఖ్య ఉద్దేశ్యం మహిళలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఉపాధిని కల్పించి, భీమా అవగాహనను పెంచడం.
అర్హతలు (Eligibility):
✓ అర్హత: 10వ తరగతి (SSC) ఉత్తీర్ణులై ఉండాలి.
✓ వయస్సు: 18 నుండి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు మాత్రమే అర్హులు.
ప్రయోజనాలు (Benefits):
✓ స్టైఫండ్ (Stipend): ఎంపికైన మహిళలకు మొదటి 3 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 7,000 స్టైఫండ్ అందుతుంది.
✓ కమీషన్: స్టైఫండ్‌తో పాటు, వారు చేసిన పాలసీల ఆధారంగా అదనపు కమీషన్ కూడా లభిస్తుంది.
✓ శిక్షణ: బీమా పాలసీలు ఎలా చేయాలో LIC ప్రత్యేక శిక్షణ ఇస్తుంది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న మహిళలు LIC అధికారిక వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
✓ మీరు నేరుగా దరఖాస్తు చేసుకోవడానికి LIC’s Bima Sakhi Apply Page లింక్‌ను ఉపయోగించవచ్చు.
✓ పూర్తి వివరాల కోసం LIC India Bima Sakhi అధికారిక పేజీని చూడవచ్చు